Trains: మరో 12 గంటల్లో తుపాను... దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 142 రైళ్ల రద్దు

  • నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
  • రేపటికి తుపానుగా మారే అవకాశం
  • ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • రైళ్ల రద్దు విషయాన్ని ప్రజలు గమనించాలన్న దక్షిణ మధ్య రైల్వే
SCR cancels 142 trains due to Cyclone Michaung

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం రాగల 12 గంటల్లో తుపానుగా మారనుంది. ఈ నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. 142కి పైగా ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. డిసెంబరు 3 నుంచి 6 వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ వెల్లడించారు. రైళ్ల రద్దు విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.

 తీవ్ర వాయుగుండం తుపానుగా మారితే మిచౌంగ్ (బలశాలి) గా పిలవనున్నారు. దీని ప్రభావంతో ఏపీలో రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు.
 
రద్దయిన ఎక్స్ ప్రెస్ రైళ్ల జాబితా ఇదే...
పాక్షికంగా రద్దయిన ప్యాసింజర్ రైళ్ల జాబితా ఇదే...

More Telugu News