Ole Ole Paapaayi: ఓలే ఓలే పాపాయి పలాసకే వచ్చేయి... 'ఎక్స్ ట్రా... ఆర్డినరీ మేన్' నుంచి మాస్ సాంగ్ ప్రోమో

Ole Ole Paapaayi song promo from Extra Ordinary Man movie out now
  • నితిన్, శ్రీలీల జంటగా ఎక్స్ ట్రా.. ఆర్డినరీ మేన్
  • వక్కంతం వంశీ దర్శకత్వం
  • డిసెంబరు 8న విడుదల కానున్న చిత్రం
నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఎక్స్ ట్రా... ఆర్డినరీ మేన్'. తాజాగా ఈ చిత్రం నుంచి "ఓలే ఓలే పాపాయి... పలాసకే వచ్చేయి" అనే హుషారైన గీతానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. హ్యారిస్ జయరాజ్ ఊపునిచ్చే బాణీలకు కాసర్ల శ్యామ్ మాస్ కిక్కు ఇచ్చే పదాలతో సాహిత్యం సమకూర్చాడు. పూర్తి పాట డిసెంబరు 4న విడుదల కానుంది. 

ఎక్స్ ట్రా... ఆర్డినరీ మేన్ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో డాక్టర్ రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, అజయ్, సుమన్, హర్షవర్ధన్, అన్నపూర్ణ, పవిత్ర నరేశ్, హైపర్ ఆది తదితరులు నటించారు. హీరో నితిన్ కుటుంబ సభ్యులే ఈ చిత్రానికి నిర్మాతలు.
Ole Ole Paapaayi
Song Promo
Nithiin
Sreeleela
Vakkantham Vamsi

More Telugu News