K Kavitha: ఆయనే నా హీరో: కవిత
![He is my hero tweets Kavitha](https://imgb.ap7am.com/thumbnail/cr-20231202tn656b03fda12c3.jpg)
- తన తండ్రి కేసీఆర్ తన హీరో అన్న కవిత
- కేసీఆర్ వీడియోను షేర్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
- వైరల్ అవుతున్న కవిత ట్వీట్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్న ఒక వీడియోను షేర్ చేసిన కవిత... 'మై హీరో' అని కాప్షన్ పెట్టారు. ఈ వీడియోను చూసిన బీఆర్ఎస్ అభిమానులు సంబరపడుతున్నారు. మరోవైపు వీడియోలో కేసీఆర్ నడుస్తుంటే... ఆయనంటే ఒక హీరో ఫీలింగ్, చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం అంటూ బ్యాక్ గ్రౌండ్ లో మాటలు వినిపిస్తాయి.