Vishal: ఒక చేతిలో కొడవలి.. మరో చేతిలో నరికిన తల.. భయంకరంగా విశాల్ ఫస్ట్ లుక్!

  • విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా 'రత్నం'
  • దర్శకత్వం వహిస్తున్న 'సింగం' ఫేమ్ హరి
  • 'రత్నం' ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్
Vishal Ratnam movie first look

తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రత్నం'. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. కార్తికేయన్ సంతానం, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'సింగం' సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఒక వ్యక్తి తలను నరికి, దాన్ని చేత్తో పెట్టుకుని, మరో చేత్తో రక్తం కారుతున్న కొడవలిని పట్టుకుని విశాల్ భయంకరంగా ఉన్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. విశాల్ సినిమాకు డీఎస్పీ సంగీతాన్ని అందించడం ఇదే తొలిసారి. 

More Telugu News