Vijayashanti: బీఆర్ఎస్ రాజకీయ భవితవ్యంపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

  • సర్వే ఫలితాలను బట్టి బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానం అధికార పక్షంగా ముగుస్తుందన్న విజయశాంతి
  • తెలంగాణకు రానున్న మంచి రోజుల కోసం డిసెంబరు 3 వరకు చూద్దామన్న కాంగ్రెస్ నేత
  • ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి
Let we wait for December 3rd Congress leader Vijayashanti

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత, ఆ పార్టీ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవితవ్యం గురించి తనకు తెలియదని, కానీ సర్వే ఫలితాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ రాజకీయ ప్రయాణం అధికార పక్షంగానే ముగుస్తుందని మాత్రం చెప్పగలనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు రానున్న మంచి రోజుల కోసం, కాంగ్రెస్ విజయం కోసం డిసెంబరు 3 వరకు చూద్దామని అన్నారు. హరహర మహాదేవ, జై తెలంగాణ, జై హింద్ అని ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల, నోటిఫికేషన్ల స్వీకరణ వరకు బీజేపీలోనే ఉన్న విజయశాంతి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ ఆమెను వెంటనే క్యాంపెయిన్ కమిటీ కోఆర్డినేటర్‌గా నియమించింది. కాగా, నవంబరు 30న విజయశాంతి ఎక్స్ వేదికగ స్పందిస్తూ.. కోట్లాది తెలంగాణ బిడ్డల జీవితాలు ఎప్పటికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నిరంతరం కోరుకునే ఒక ఉద్యమకారిణని పేర్కొంటూ ఓ వీడియో సాంగ్‌ను జతచేశారు. తన కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా అయిన ‘ఒసేయ్ రాములమ్మా’ లోని ‘పుల్లాలమంటివి కదరా.. ఇదిగో పులి పిల్లాలై వచ్చినామూరా పట్వారి కొడకా’ అనే పాటను జోడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించే ఆమె ఈ పాటను పోస్టు చేశారన్న ప్రచారం జరుగుతోంది.

More Telugu News