Mohammed Shami: చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ.. సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు దూరం!

  • గాయం మైదానంలో అయింది కాకపోవచ్చంటున్న బీసీసీఐ వర్గాలు
  • కన్సల్టేషన్ కోసం ముంబైలో వాలిపోయిన షమీ
  • అనంతరం పునరావాసం కోసం బెంగళూరుకు
Mohammed Shami seeks medical treatment for ankle injury

చీలమండ గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ మహ్మద్ షమీ ముంబైలో చికిత్స తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ ఆర్థోపెడిక్‌‌‌ను సంప్రదించేందుకు 33 ఏళ్ల షమీ ప్రస్తుతం ముంబైలోనే ఉన్నాడు. ఈ గాయం అతడికి మైదానంలో అయి ఉండకపోవచ్చని, వైద్యులను కలిసేందుకు అతడు ముంబై వచ్చాడని, ఆ తర్వాత పునరావాసం కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్తాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

సౌతాఫ్రికాతో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం షమీని సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే, బాక్సింగ్ డే టెస్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశం తక్కువేనని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో షమీ అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. కేవలం 7 మ్యాచుల్లోనే 10.70 సగటుతో ఏకంగా 24 వికెట్లు పడగొట్టి పలు రికార్డులు కొల్లగొట్టాడు.

More Telugu News