Road Accident: పోలీసు ఆఫీసర్ తనయుడి ర్యాష్ డ్రైవింగ్.. మహిళ దుర్మరణం

woman dies after car hits her in Hanmakonda driver said to be police officers son
  • హన్మకొండలోని కాజీపేట కేంద్రంలో ఘటన 
  • బైక్ ఎక్కుతున్న మహిళను వెనక నుంచి ఢీకొట్టిన కారు
  • ఘటనా స్థలంలోనే మహిళ మృతి
ర్యాష్ డ్రైవింగ్ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ పోలీసు అధికారి తనయుడు కారుతో ఓ మహిళను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. హన్మకొండ జిల్లాలోని కాజీపేట కేంద్రంలో ఈ ప్రమాద ఘటన జరిగింది. సెయింట్ గాబ్రియెల్ స్కూలు వద్ద కవిత అనే మహిళ బైక్ ఎక్కబోతుండగా స్విఫ్ట్ కారు వెనక నుంచి వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. 

ఓటు వేయడానికి భర్తతో వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కారు రాంగ్ రూట్‌లో మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో యాక్సిడెంట్ జరిగింది. కారు నడిపిన యువకుడు ఎక్సైజ్ శాఖ సీఐ కుమారుడని సమాచారం.
Road Accident
Hanmkonda district
Telangana
Viral Videos

More Telugu News