YS Jagan: సీఎం జగన్ ఆస్తుల కేసుపై సీబీఐ కోర్టులో విచారణ

CBI Court takes up hearing on CM Jagan assets case

  • సీఎం జగన్ ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు
  • 127 డిశ్చార్జి పిటిషన్లపై ఓ కొలిక్కి వచ్చిన వాదనలు
  • లిఖితపూర్వక వాదనలు ఉంటే సమర్పించాలన్న న్యాయస్థానం
  • తదుపరి విచారణ ఈ నెల 15కి వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టులో నేడు విచారణ జరిగింది. లిఖితపూర్వక వాదనలు ఉంటే సమర్పించాలని సీబీఐ కోర్టు... సీబీఐ, ఈడీ, నిందితుల తరఫు న్యాయవాదులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 15కి వాయిదా వేసింది. 

కాగా, ఇవాళ్టి విచారణలో సీఎం జగన్ తదితరులకు సంబంధించిన 127 డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. అంతేకాదు, నిందితులపై సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లు, ఈడీ దాఖలు చేసిన 8 చార్జిషీట్లపై నిందితుల పిటిషన్లపై విచారణ కూడా ఓ కొలిక్కి వచ్చింది. సీఎం జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సుదీర్ఘకాలంగా సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News