Chandrababu: గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబు దంపతులకు ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు

Chandrababu and Nara Bhuvaneswaria arrives Gannavaram
  • ఈ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు దంపతులు
  • రేణిగుంట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం పయనం
  • ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా విజయవాడ చేరుకోనున్న చంద్రబాబు
ఈ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, నారా భువనేశ్వరి రేణిగుంట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబు దంపతులకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కాగా, నారా భువనేశ్వరి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లిపోగా, చంద్రబాబు విమానాశ్రయం నుంచి ర్యాలీగా విజయవాడ రానున్నారు. 

చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోకముందు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబు రాకకు ముందే జనసేనాని పవన్ కల్యాణ్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే పవన్ ను పోలీసులు ఎయిర్ పోర్టు వెనుక మార్గం నుంచి పంపించారు. పవన్ గన్నవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
Chandrababu
Nara Bhuvaneswari
Gannavaram Airport
TDP
Vijayawada
Pawan Kalyan
Janasena
Andhra Pradesh

More Telugu News