Boat Accident: కాకినాడ తీరంలో బోటు ప్రమాదం.. జాలర్లు సేఫ్.. రూ. 80 లక్షల ఆస్తినష్టం

  • వారం రోజుల క్రితం చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన బోటు
  • తుపాను హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్టణం తిరుగుపయనం
  • మరో నాలుగు గంటల్లో కాకినాడ చేరుకుంటుందనగా ఇంజిన్‌లో మంటలు
  • పేలిన సిండర్లు.. బోటు దగ్ధం
Boat catches fire near Kakinada coast

కాకినాడ సముద్ర తీరంలో ఓ బోటులో జరిగిన అగ్నిప్రమాదంలో రూ. 80 లక్షల ఆస్తినష్టం సంభవించింది. వారం రోజుల క్రితం చేపలవేటకు సముద్రంలోకి వెళ్లిన బోటు తుపాను హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్టణానికి తిరుగుపయనమైంది. మరో నాలుగు గంటల్లో కాకినాడ చేరుకుంటుందనగా తెల్లవారుజామున ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే బోటులో ఉన్న సిలిండర్లు కూడా పెద్ద శబ్దంతో పేలిపోయాయి. అప్రమత్తమైన మత్స్యకారులు సముద్రంలోకి దూకేశారు.

బోటు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న తీర రక్షక దళం సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బోటులోని 12 మంది జాలర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం కారణంగా దాదాపు రూ. 80 లక్షల ఆస్తినష్టం సంభవించినట్టు మత్స్యకారులు తెలిపారు.

More Telugu News