Nara Bhuvaneswari: నా ప్రార్థనలకు సమాధానం లభించింది.. తిరుమల శ్రీవారి దర్శనానంతరం నారా భువనేశ్వరి వ్యాఖ్య

we sought the blessings of Lord Sri Venkateswara Swamy in Tirupati together says Nara Bhuvaneswari
  • భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భువనేశ్వరి
  • తన భర్త పక్కన లేకుండానే చివరి సారి స్వామిని దర్శించుకున్నానన్న భువనేశ్వరి
  • ఇప్పుడు ఇద్దరం కలిసి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్నామని వ్యాఖ్య
టీటీడీ అధినేత చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారితో పాటు మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డితో పాటు పలువురు నేతలు కూడా ఉన్నారు. మరోవైపు స్వామి వారి దర్శనానంతరం నారా భువనేశ్వరి ఎక్స్ వేదికగా స్పందించారు. తన భర్త పక్కన లేకుండానే స్వామి వారిని చివరి సారి దర్శించుకున్నానని ఆమె చెప్పారు. ఈరోజు ఇద్దరం కలిసి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నామని, స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్నామని తెలిపారు. చివరిసారి స్వామి వారిని దర్శించుకున్నప్పుడు చెప్పుకున్న తన బాధలకు, తన ప్రార్థనలకు సమాధానం లభించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
Nara Bhuvaneswari
Chandrababu
Telugudesam
Tirumala

More Telugu News