Special Trains: తెలుగు రాష్ట్రాల మధ్య 10 ప్రత్యేక రైళ్లు ఈ నెలాఖరు వరకు పొడిగింపు

  • ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నిర్ణయం
  • కాకినాడ-లింగంపల్లి రైలు నేటి నుంచి 29 వరకు పొడిగింపు
  • హైదరాబాద్-నర్సాపూర్ రైలు రేపటి నుంచి 30 వరకు అందుబాటులో
  • తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి మధ్య కూడా నడవనున్న ప్రత్యేక రైళ్లు
South Central Railway extends 10 special trains to 31dec

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్తే. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే సేవలందిస్తున్న 10 ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-తిరుపతి (07482) రైలు ఈ నెల 4 నుంచి 25వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07481) 3వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది.

హైదరాబాద్-నర్సాపూర్ (07631) రైలు రేపటి నుంచి ఈ నెల 30 వరకు ప్రతి శనివారం, తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07332) ఎల్లుండి (3వ తేదీ) నుంచి ఈ నెలాఖరు వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. కాకినాడ-లింగంపల్లి (07445) రైలు నేటి నుంచి 29 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో, తిరుగు ప్రయాణంలో రేపటి నుంచి 30వ తేదీ వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే, తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి మధ్య కూడా రెండు జతల ప్రత్యేక రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

More Telugu News