ఏపీకి తుఫాను ముప్పు..ఐఎండీ హెచ్చరిక
- బంగాళాఖాతంలో అల్పపీడనం, త్వరలో తుపానుగా బలపడనున్న వైనం
- డిసెంబర్ 3-5 తేదీల్లో కోస్తా ఆంధ్రకు సమీపంగా అల్పపీడనం
- నేటి నుంచి మూడు-నాలుగు రోజుల పాటు రాయలసీమలోనూ వర్షాలు
- మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరిక
ఈ తుపాను భారత ఆగ్నేయ తీరంపై ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరిల్లో శుక్రవారం నుంచి సోమవారం వరకూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. డిసెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. అల్పపీడనం కారణంగా కోస్తా ఆంధ్రలో 65.2 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకూ వర్షపాతం నమోదవ్వొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.