Bandi Sanjay: ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయి: బండి సంజయ్

  • జీహెచ్ఎంసీ, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యాయన్న బండి సంజయ్
  • 3వ తేదీన బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని ధీమా 
  • కరీంనగర్‌లో తాను కచ్చితంగా గెలుస్తానని వెల్లడి
Bandi Sanjay on Exit polls

ఎగ్జిట్ పోల్స్‌పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌ తారుమారు అవుతాయని జోస్యం చెప్పారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోను, దుబ్బాక ఉప ఎన్నికల్లోను బీజేపీ గెలవదని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయని గుర్తు చేశారు. కానీ రెండు ఎన్నికల్లో బీజేపీ ఎంతటి ఘన విజయం సాధించిందో చూశారన్నారు. డిసెంబర్ 3వ తేదీన బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. తాము మంచి సీట్లు సాధిస్తామన్నారు. కరీంనగర్‌లో తాను కచ్చితంగా అద్భుత విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పొత్తులకు సంబంధించి ఏమైనా ఉంటే.. అన్నీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

More Telugu News