Narendra Modi: ప్రపంచ వాతావరణ సదస్సు కోసం దుబాయ్ పయనమైన ప్రధాని మోదీ

  • యూఏఈ అధ్యక్షతన ప్రపంచ వాతావరణ సదస్సు
  • రేపు దుబాయ్ లో సమావేశం
  • ఈ సమావేశానికి మోదీని ఆహ్వానించిన యూఏఈ అధ్యక్షుడు 
Modi off to Dubai to attend world climate action summit

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రేపు (డిసెంబరు 1) ప్రపంచ వాతావరణ సదస్సు జరగనుంది. 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ) సదస్సులో భాగంగా జరుగుతున్న ఈ వాతావరణ కార్యాచరణ సమావేశానికి హాజరవడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దుబాయ్ పయనమయ్యారు. ఈ సదస్సుకు రావాలంటూ ప్రధాని మోదీని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ (అబుదాబి పాలకుడు) ఆహ్వానించారు. 

దీనిపై మోదీ స్పందిస్తూ, యూఏఈ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుండడం సంతోషదాయకమని తెలిపారు. వాతావరణ పరిరక్షణ అంశంలో భారత్ కు యూఏఈ ముఖ్యమైన భాగస్వామిగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన జీ20 సమావేశాల్లోనూ వాతావరణ కార్యాచరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని మోదీ వివరించారు.

More Telugu News