Prabhas: ఇటు ప్రభాస్ .. అటు కమల్: 'కల్కి 2898 AD' అప్ డేట్!

  • ప్రభాస్ పాన్ ఇండియా మూవీగా 'కల్కి'
  • కీలకమైన పాత్రను పోషిస్తున్న కమల్ 
  • హైదరాబాదులో జరుగుతున్న షూటింగ్
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు

Kalki Movie Update

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD' సినిమా రూపొందుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. గతంలో ఈ బ్యానర్ పై ఎన్నో భారీ సినిమాలు వచ్చాయి. వాటన్నిటిని మించిన బడ్జెట్ ఈ సినిమా కోసం కేటాయించడం విశేషం. ఈ సినిమా విశేషాలు తెలుసుకోవడానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఆసక్తిని కనబరుస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో కమలహాసన్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రను నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని అంటున్నారు.  కొన్ని రోజులుగా కమల్ - ప్రభాస్ కాంబినేషన్లోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ప్రభాస్ - కమల్ కాంబినేషన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. సాంకేతిక పరంగా ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను తలపిస్తుందని అంటున్నారు. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిస్తుందనే టాక్ ఉంది. అమితాబ్ .. దీపికా పదుకొణే .. దిశా పటాని ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Telugu News