Telangana Elections: తెలంగాణలో ముగిసిన పోలింగ్.. ఈవీఎంలలో అభ్యర్థుల భవిష్యత్తు!

  • సాయంత్రం 5 గంటలకు ముగిసిన పోలింగ్
  • డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్
  • గత ఎన్నికలతో పోలిస్తే తగ్గిన పోలింగ్ శాతం
Telangana elections polling ended

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు... మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కు తెరపడింది. 5 గంటల లోపు పోలింగ్ బూత్ ల వద్ద క్యూ లైన్లలో ఉన్నవారికి మాత్రం ఓటు వేసే అవకాశం ఉంటుంది. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయింది. మరో గంట, గంటన్నరలో క్యూ లైన్లలో ఉన్న వారు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 

డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల్లో నిలబడ్డ 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం 3న తేలనుంది. తదుపరి ప్రభుత్వం ఎవరిదో తేలిపోనుంది. ఈ ఎన్నికలు అక్కడక్కడ చిన్నిచిన్న ఘర్షణలు మినహా ప్రశాంతంగా జరిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడం నిరాశాజనకమైన విషయంగా చెప్పుకోవచ్చు.

More Telugu News