Ben Stokes: చేతి కర్రల సాయంతో బెన్ స్టోక్స్... వైరల్ అవుతున్న ఫొటో!

  • చాలాకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న స్టోక్స్
  • ఇంగ్లండ్ లోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స
  • ఎక్స్ లో వెల్లడించిన స్టోక్స్
Ben Stokes underwent successful knee surgery

ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేలకు ప్రకటించిన రిటైర్ మెంట్ ను కూడా పక్కనబెట్టి ఇటీవల వరల్డ్ కప్ లో ఆడిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో పలు మ్యాచ్ లకు దూరంగా ఉన్న స్టోక్స్... ఆ తర్వాత బరిలో దిగి కొద్దిమేర రాణించినప్పటికీ ఇంగ్లండ్ జట్టుకు ఘోర పరాజయాలు మాత్రం తప్పలేదు. 

వరల్డ్ కప్ లో స్టోక్స్ బ్యాటింగ్ అయితే చేశాడు కానీ, బౌలింగ్ కు మాత్రం దూరంగా ఉన్నాడు. తద్వారా తన ఆల్ రౌండర్ ట్యాగ్ కు న్యాయం చేయలేకపోయాడు. అందుకు కారణం సుదీర్ఘకాలంగా వేధిస్తున్న మోకాలి గాయమే. 

వరల్డ్ కప్ ముగియడంతో స్వదేశానికి వెళ్లిపోయిన స్టోక్స్ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆసుపత్రి ఎదుట చేతి కర్రల సాయంతో నిల్చున్న ఫొటోను స్టోక్స్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. "ఆసుపత్రిలో చేరాను, డిశ్చార్జి అయ్యాను... శస్త్రచికిత్స జరిగింది... ఇక కోలుకోవడమే మిగిలుంది" అంటూ ట్వీట్ చేశాడు. 

స్టోక్స్ టెస్టుల్లో ఇంగ్లండ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటన కల్లా స్టోక్స్ కోలుకుని బరిలో దిగే అవకాశాలున్నాయి.

More Telugu News