Spirit: ప్రభాస్ తో 'స్పిరిట్' మూవీపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా!

  • సందీప్ రెడ్డి నుంచి వస్తున్న 'యానిమల్' మూవీ 
  • ప్రమోషన్స్ లో ఆయన ఫుల్ బిజీ 
  • ప్రభాస్ తో 'స్పిరిట్' మూవీ ఉందని వెల్లడి 
  • వచ్చే అక్టోబర్ లో మొదలవుతుందని క్లారిటీ

Sandeep Reddy Vanga Interview

'అర్జున్ రెడ్డి' సినిమా ఒక సంచలనాన్ని సృష్టించింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఆ తరువాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యాడు. ప్రభాస్ తో 'స్పిరిట్' అనే సినిమా చేయనున్నట్టు కొంతకాలం క్రితం ఆయన ప్రకటించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే యూత్ లో ఆసక్తి పెరుగుతూ పోయింది. 

ప్రభాస్ ముందుగా ఒప్పుకున్న పాన్ ఇండియా సినిమాలను వరుసగా చేసుకుంటూ వెళుతున్నాడు. ఓ మాదిరి బడ్జెట్ గా అనుకున్న మారుతి సినిమా కూడా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మళ్లీ ఎక్కడా 'స్పిరిట్' సినిమాను గురించిన ప్రస్తావన లేకుండా పోయింది. దాంతో ఈ ప్రాజెక్టు లేదేమోననే ఒక డౌట్ కూడా చాలామందిలో తలెత్తింది. 

'యానిమల్' సినిమా ప్రమోషన్స్ లో ఉన్న సందీప్ కి 'స్పిరిట్' సినిమా గురించిన ప్రశ్న ఎదురైంది. అందుకు సందీప్ స్పందిస్తూ .. "ప్రభాస్ తో సినిమా ఉంది .. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయం ఎప్పుడు వస్తుందా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. వచ్చే ఏడాది అక్టోబర్ లో ఈ సినిమా షూటింగు మొదలవుతుంది" అని ఆయన క్లారిటీ ఇచ్చాడు. 

More Telugu News