Sri Lanka Cricket Team: ఫుల్ జోష్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు.. వరుస సిరీస్‌లను ప్రకటించిన బోర్డు.. భారత్‌తో వన్డే, టీ20 సిరీస్

  • శ్రీలంకపై నిషేధాన్ని ఎత్తేసిన ఐసీసీ
  • వచ్చే ఏడాది జింబాబ్వే పర్యటనతో టూర్ మొదలు
  • టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్
  • ఏడాదిలో మొత్తం వన్డేలు, టీ20లు, టెస్టులు కలిపి 51 మ్యాచ్‌లు ఆడనున్న లంక జట్టు
Sri Lanka to play white ball series with india

శ్రీలంక క్రికెట్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) ఇటీవల తొలగించడంతో ఆ జట్టు భారత్‌ పర్యటనకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్‌తో మూడు వన్డేలు, అంతే సంఖ్యలో టీ20లతో కూడిన ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు రానుంది. ఈ మేరకు 2024లో శ్రీలంక క్రికెట్ షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది.

దీని ప్రకారం శ్రీలంక జట్టు వచ్చే ఏడాది మొత్తం 10 టెస్టులు, 21 వన్డేలు, 21 టీ20లు సహా మొత్తం 51 మ్యాచ్‌లు ఆడనుంది. జనవరిలో జింబాబ్వేతో సిరీస్‌తో ఆ జట్టు అంతర్జాతీయ పర్యటన ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్, భారత్‌తో తలపడుతుంది. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. ఇది ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. జనవరిలో ఆఫ్ఘనిస్థాన్, ఫిబ్రవరిలో ఇంగ్లండ్, ఆ తర్వాత శ్రీలంకలో పర్యటిస్తుంది.

More Telugu News