K Kavitha: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Casts her vote
  • బంజారాహిల్స్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న కవిత
  • ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు
  • పట్టణాల్లోని వారు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని సూచన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ మొదలైంది. ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఓటేయాలని కవిత పిలుపునిచ్చారు. పట్టణాల్లో ఓటింగ్ తక్కువ అన్న చెడ్డపేరు ఉందని అన్నారు. కాబట్టి.. నగరాలు, పట్టణాల్లోని వారు, యువత పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. 



K Kavitha
Telangana Assembly Election
Hyderabad
BRS

More Telugu News