Hyderabad Poll Queue Status: హైద్రాబాద్‌లోని తమ పోలింగ్‌ కేంద్రం క్యూలో ఎందరున్నారో ఇంటి నుంచే చెక్ చేసుకోవచ్చు!

  • నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కీలక చర్యలు
  • జీహెచ్ఎంసీ వెబ్‌సైట్, యాప్ ద్వారా క్యూలైన్ వివరాలు
  • పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు
Know polling center queline status in hyderabad through ghmc website and app

మహానగరాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ విస్తృత కసరత్తు చేస్తోంది. పోలింగ్ కేంద్రాల్లో భారీ క్యూలైన్లకు తోడు , వసతులు లేకపోవడం వంటి కారణాలతో ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారని ఈసీ గుర్తించింది. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులకు ఓ ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. పోలింగ్ కేంద్రాల్లోని క్యూ లైన్లలో ఎంత మంది ఉన్నారో ఇంటి నుంచే తెలుసుకునే వీలు కల్పించింది. 

https://ghmcbls.in/poll-queue-status వైబ్‌సైట్ ద్వారా క్యూలైన్లో ఎందరు ఉన్నారో, ఓటింగ్‌కు ఎంత సమయం పడుతుందో తెలుసుకుని తగిన సమయంలో ఓటేసి రావచ్చు. వెబ్‌సైట్‌లో ఓటర్లు తమ నియోజకవర్గాన్ని ఎంచుకుని, ఆపై తమ పోలింగ్ స్టేషన్‌ను ఎంచుకుంటే ఈ వివరాలు తెలుస్తాయి. ఓటర్లు PollQRoute ద్వారా కూడా ఈ వివరాలు తెలుసుకుని చకచకా ఓటేసీ రావచ్చని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేశామని కూడా ఆయన తెలిపారు.

More Telugu News