Chiranjeevi: రేపు ఉదయం ఓటు వేయనున్న చిరంజీవి, మధ్యాహ్నం రామ్ చరణ్ తేజ్

Chiranjeevi is casting his vote tomorrow at Jubilee hills club
  • ఉదయం ఎనిమిది గంటలకు జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు వేయనున్న చిరంజీవి
  • మధ్యాహ్నం రెండు గంటలకు రామ్ చరణ్ తేజ్ ఓటు
  • ఎన్నికలకు ఏర్పాట్లు చేసిన ఎన్నికల కమిషన్
మెగాస్టార్ చిరంజీవి రేపు ఉదయం తన ఓటు హక్కును జూబ్లీహిల్స్ క్లబ్‌లో వినియోగించుకోనున్నారు. రేపు 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చిరంజీవి రేపు ఉదయం ఎనిమిది గంటలకు జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు వేస్తారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా మధ్యాహ్నం రెండు గంటలకు జూబ్లీ హిల్స్ క్లబ్‌లోనే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Chiranjeevi
Ramcharan
Telangana Assembly Election

More Telugu News