BRS: సాయంత్రం గం.5 లోపు పోలింగ్ కేంద్రంలో ఉంటేనే ఓటు వేసే అవకాశం!

  • రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
  • సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చి క్యూలో నిలబడితే ఓటు వేయవచ్చు
  • ఐదు గంటల తర్వాత పోలింగ్ కేంద్రానికి వస్తే ఓటు వేయడానికి అవకాశం ఉండదు
Voting will not be allowed after 5 clock

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే ప్రయాణం బడలిక వంటి కారణాల వల్ల పోలింగ్ బూత్‌కు రావడం ఆలస్యం కావొచ్చు. ఈ పరిస్థితుల్లో ఏ సమయం వరకు పోలింగ్ బూత్‌లో ఉంటే ఓటు వేయొచ్చో తెలుసా?

ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చే ఓటర్లను అధికారులు లోపలికి అనుమతించరు. కానీ సాయంత్రం ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రం దగ్గర వరుసలో/క్యూలో నిలుచుకుంటే మాత్రం ఓటు వేసేందుకు అనుమతిస్తారు. కనుక ఎన్నికల నియమావళి ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటే ఓటు వేయవచ్చు. క్యూ ఎంత పొడవు ఉన్నా మీకు ఓటు వేసే అవకాశం ఇస్తారు. కానీ ఐదు దాటిన తర్వాత పోలింగ్ కేంద్రానికి వస్తే అవకాశం ఉండదు.

More Telugu News