KTR: మంత్రి కేటీఆర్ దీక్షా దివస్... ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

  • బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ఫిర్యాదు
  • తెలంగాణ భవన్ లోపల నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని ఈసీ సూచన
Congress complaints against Minister KTR on Deeksha Divas

మంత్రి కేటీఆర్ చేస్తున్న దీక్షా దివస్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో నేడు దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో దీక్షను చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రేపు పోలింగ్ ఉందని, 144వ సెక్షన్ అమలులో ఉన్న సమయంలో దీక్షా దివస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని చెబుతూ కాంగ్రెస్.. ఈసీకి ఫిర్యాదు చేసింది. తక్షణమే దీక్షా దివస్‌ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్క్వాడ్ తెలంగాణ భవన్‌కు వెళ్లి.. దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని బీఆర్ఎస్ నేతలను కోరింది. అయితే ఇది కొత్త కార్యక్రమం కాదని, ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అయితే కార్యక్రమాన్ని తెలంగాణ భవన్ లోపల... నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని అధికారులు సూచించారు. దీంతో భవనం లోపల కార్యక్రమాన్ని నిర్వహించారు. దీక్షా దివస్ సందర్భంగా మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు.

More Telugu News