Polling Day: రేపు సెలవు ప్రకటించని ఐటీ కంపెనీలు.. రంగంలోకి దిగిన చీఫ్ ఎలక్టోరల్ అధికారి

CEO asks Labour Commissioner to ensure holiday on polling day
  • రాష్ట్రవ్యాప్తంగా రేపు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
  • హాలిడే ఇవ్వని ఐటీ కంపెనీలు
  • తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేబర్ కమిషన్‌కు చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఆదేశం
  • 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ సెలవు ఇవ్వని ఐటీ కంపెనీలు
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే, ఐటీ కంపెనీలు మాత్రం సెలవు ఇవ్వకపోవడంతో చీఫ్ ఎలక్టోరల్ అధికారి వికాస్‌రాజ్ రంగంలోకి దిగారు. పోలింగ్ రోజైన రేపు (నవంబర్ 30) అన్ని సంస్థలు, కంపెనీలు, సెలవు ప్రకటించినదీ, లేనిదీ నిర్ధారించుకోవాలని లేబర్ కమిషన్‌ను ఆదేశించారు. ఒకవేళ సెలవు ప్రకటించని పక్షంలో ఎలక్టోరల్ లా, లేబర్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంటు ఎన్నిక సమయంలోనూ చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ఇవ్వకుండా పనిచేయించుకున్నాయి. ఉద్యోగులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం రంగంలోకి దిగి ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఎన్నికల నేపథ్యంలో విద్యాసంస్థలకు నేడు, రేపు సెలవులు ప్రకటించారు.
Polling Day
Telangana Assembly Election
IT Companies
Election Commission
Polling Holiday

More Telugu News