Nara Lokesh: అది చంద్రబాబుతోనే సాధ్యం: నారా లోకేశ్

  • కోనసీమ జిల్లాలో లోకేశ్ యువగళం
  • నేడు అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో పాదయాత్ర
  • భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి
Lokesh Yuvagalam Padayatra details on 211th day

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 211వ రోజు అమలాపురం, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగింది. పాదయాత్ర అమలాపురం పట్టణానికి చేరుకోగానే మహిళలు హారతులు పడుతూ లోకేశ్ కు నీరాజనాలు పలికారు. 

అనాతవరం వద్ద యువగళం పాదయాత్ర ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించించింది. ముమ్మడివరం ఇన్ ఛార్జి దాట్ల సుబ్బరాజు నేతృత్వంలో లోకేశ్ కు కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు, అమలాపురం సమీపంలోని భట్నవిల్లిలో యువతతో జరిగిన ముఖాముఖి సమావేశంలో లోకేశ్ ప్రసంగించారు.

రాబోయే ఎన్నికల్లో యూత్ పవర్ ను జగన్ కు చూపాలి!

రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవితకు ఎంతో కీలకం, యువత పవర్ ఏంటో యువ ఓటర్లు మొదటి సారి జగన్ కి చూపించాలి. యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలి. మార్పు రావాలి అనుకోవడం కాదు... మార్పు కోసం మీరు ముందుకు రావాలి. ఏపీలో ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు... రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉండేది... జగన్ ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మార్చేశాడు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి కియా, ఫాక్స్ కాన్ లాంటి కంపెనీలు వచ్చాయి. జగన్ హయాంలో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ వచ్చాయి. 

పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలు చేస్తాం

విద్యా దీవెన, వసతి దీవెన అంటూ కొత్త పథకాలు తెచ్చి వ్యవస్థను జగన్ నాశనం చేశాడు. దీని వలన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ , జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభిస్తాం. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. జగన్ లా జాబ్ లెస్ క్యాలెండర్ కాదు... ప్రతి ఏడాది ఒక పద్దతి ప్రకారం పెండింగ్ లో ఉన్న అన్ని ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. 

నూతన విద్యా విధానం పేరుతో టీచర్ పోస్టులకు జగన్ కోత పెడుతున్నాడు. జగన్ భర్తీ చేస్తానన్న 2.30 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ లేదు. జగన్ పాలనలో ఆక్వాకి, వరి, ఇతర రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఏపీలో కేవలం గంజాయికి మాత్రమే గిట్టుబాటు ధర ఉంది.

ఎయిడెడ్ విద్యావ్యవస్థను నాశనం చేసిన జగన్

టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 3 వేల కోట్లు ఖర్చు చేశాం. జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ వ్యవస్థను నాశనం చేసింది. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన మేర ప్రభుత్వ కాలేజీలు ప్రారంభిస్తాం. ఫిజియోథెరపీ విలువ నాకు పాదయాత్ర ప్రారంభించిన తరువాత తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపీ పోస్టులు కల్పించేలా అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం

రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఎవరైనా అడిగితే చెప్పే పరిస్థితి లేకుండా చేశాడు. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి ఇతర జిల్లాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ చేశారు. జగన్ ప్రభుత్వం అడ్వకేట్లను కూడా ఇబ్బంది పెడుతోంది. 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూవివాదాల పరిష్కారం కోర్టులో కాకుండా రాజకీయ నాయకులు ప్రమేయంతో జరిగే వ్యవస్థ తీసుకురావాలని అనుకుంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులపై పెత్తనం చెయ్యాలని జగన్ ఆలోచిస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తెచ్చిన కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం.

రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం బాబువల్లే సాధ్యం

జగన్ పాలన ముగిసే సరికి ఏపీ అప్పు 12 లక్షల కోట్లకు చేరుతుంది. జగన్ గ్రోత్ ఇంజిన్ ని ఆపేశాడు. జగన్ వలన రాష్ట్రం పరువు పోయింది. అమర్ రాజా లాంటి అనేక కంపెనీలను పక్క రాష్ట్రానికి తరిమేశాడు. విశాఖ మిలీనియం టవర్స్ కి నేను తెచ్చిన ఐటీ కంపెనీలను తరిమేసి సచివాలయం చేస్తానని జగన్ అంటున్నాడు. రాష్ట్రంపై పోయిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. రాష్ట్రం పరువు నిలబెట్టడం ఒక్క చంద్రబాబు గారితోనే సాధ్యం.

లోకేశ్ ను కలిసిన మాలమహానాడు ప్రతినిధులు

అమలాపురం రూరల్ భట్నవిల్లిలో పీవీ రావు మాలమహానాడు ప్రతినిధులు నారా లోకేశ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. "మీరు అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం రద్దుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరించండి. అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరించండి. ఎస్సీల్లో అత్యధిక జనాభా కలిగిన మాకు అన్యాయం చేసేలా కొన్ని స్వార్థపర శక్తులు తెరపైకి తెస్తున్న ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపవద్దని కోరుతున్నాం" అని లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు.

అందుకు లోకేశ్ స్పందిస్తూ....

"నా ఎస్సీలు, నా బీసీలు అంటున్న జగన్మోహన్ రెడ్డి ఆయా వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. దళితులకు చెందాల్సిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేయడమేగాక , రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన దళిత ద్రోహి జగన్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు జరిగిన అన్యాయాలను ప్రశ్నించిన దళితులపై జగన్ సర్కారు తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం. అంబేద్కర్ విదేశీ విద్య, బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్ పథకాలను పునరుద్దరిస్తాం" అని స్పష్టం చేశారు.

=====

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2886.3 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 18.5 కి.మీ.*

*212వరోజు (29-11-2023) యువగళం వివరాలు*

*అమలాపురం/ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాలు*

*ఉదయం*

10.00 – ముమ్మిడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.

10.15 – ముమ్మిడివరం కొండమ్మ చింత సెంటర్ లో డ్వాక్రామహిళలతో భేటీ.

10.30 – ముమ్మిడివరం ఎన్టీఆర్, బాలయోగి విగ్రహాల వద్ద గౌడలతో సమావేశం.

11.00 – ముమ్మిడివరం సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.

మధ్యాహ్నం


12.45 – ముమ్మిడివరం పల్లెపాలెం సెంటర్ లో దళితులతో సమావేశం.

1.30 – కొమనాపల్లి సెంటర్ లో స్థానికులతో సమావేశం.

2.30 – అన్నంపల్లి సెంటర్ లో మాదిగ సామాజికవర్గీయులతో భేటీ.

3.30 – మురమళ్ల సెంటర్ లో బుడగ జంగాలతో సమావేశం.

3.45 – మురమళ్లలో భోజన విరామం.

*సాయంత్రం*

5.00 – మురమళ్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.

6.00 – కొమరగిరిలో స్థానికులతో సమావేశం.

7.15 – ఎదుర్లంక సెంటర్ లో స్థానికులతో సమావేశం.

7.30 – పాత ఇంజరం వద్ద పాదయాత్ర 2900 కి.మీ.లకు చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.

9.00 – సుంకరపాలెం విడిది కేంద్రంలో బస.

******

More Telugu News