Bigg Boss: 'బిగ్ బాస్' హౌస్ లో నన్ను ఏకాకిని చేశారు: అశ్విని

Bigg Boss 7 Update
  • బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చేసిన అశ్విని 
  • ప్రశాంత్ భజన చేయలేదని వెల్లడి 
  • ప్రియాంకపై కోపం లేదని వ్యాఖ్య 
  • అలా అనడం పొరపాటేనని వివరణ

'బిగ్ బాస్' హౌస్ నుంచి అశ్విని బయటికి వచ్చేసింది. సెల్ఫ్ నామినేషన్ కారణంగా ఆమె ఎలిమినేట్ అయింది. తాజాగా ఒక యూ ట్యూబ్  ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "నేను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలోకి వెళ్లాను. ప్రశాంత్ తో చనువుగా ఉండటం వలన నాకు ఓట్లు ఎక్కువ పడతాయని నేను ఆలోచన చేయలేదు. అందుకోసం అతని భజన చేయలేదు. అతని ఆటతీరు నచ్చడం వల్లనే అలా ఉన్నాను" అని అంది. 

" నిజానికి నాకు అందరితో కలిసిపోయి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండటం ఇష్టం. కానీ హౌస్ లో ఎవరూ కూడా నాతో కలవలేదు .. నాతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. పైగా నేను ఏది చేసినా తప్పుబట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ కలిసి నన్ను ఏకాకిని చేశారు. అందువలన నేను ఎవరితో ఏదీ షేర్ చేసుకోలేకపోయాను" అని చెప్పింది. 

'సేఫ్ గేమ్ ఆడటం నాకు చేతకాదు .. నాకు తెలిసినట్టుగా నేను ఆడాను. ప్రియాంకపై నాకు ఎలాంటి కోపం లేదు. అక్కడ నాకు ఎదురైన పరిస్థితులను బట్టి నేను స్పందించాను అంతే. ఈ కాలంలో నాలా ఉండటం కరెక్టు కాదనే విషయం నాకు అర్థమైంది. బిగ్ బాస్ కి ఎవరైనా కప్పుకోసమే వెళతారు. కానీ నేను కప్పుకోసం రాలేదని అనడం పొరపాటే అయింది" అంటూ చెప్పింది. 
Bigg Boss
Ashvini
Prashanth
Priyanka

More Telugu News