నోట్ల కట్టలతో దొరికిన సీఐపై కాంగ్రెస్ నేతల దాడి.. వీడియో ఇదిగో!
- మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో సోమవారం సాయంత్రం ఘటన
- కారు ఆపి లోపల చెక్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
- ఓ సంచీలో నోట్ల కట్టలు కనిపించడంతో చెంప పగలకొట్టిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
కారులో నోట్ల కట్టలు తరలిస్తున్న వ్యక్తి వరంగల్ అర్బన్ సీఐ అంజిత్ రావు అని సమాచారం. క్లాత్ బ్యాగ్ లో నోట్ల కట్టలతో పాటు పోలీస్ ఐడెంటిటీ కార్డు కూడా ఉండడం వీడియోలో కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల అధికారులు.. డబ్బు సంచీతో పాటు కారును కూడా సీజ్ చేశారు. కాగా, ఈ డబ్బు మంత్రి మల్లారెడ్డిదేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.