Telangana Assembly Election: తెలంగాణ ఎన్నికలు.. రాజకీయ ఎస్ఎమ్మెస్‌లపై నిషేధం

  • మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 వరకూ సైలెన్స్ పీరియడ్
  • ఈ సమయంలో అభ్యంతరకర, రాజకీయ, బల్క్ ఎస్ఎంఎస్‌లపై నిషేధం ఉందంటున్న కరీంనగర్ కలెక్టర్
  • పరిస్థితులను నిత్యం గమనిస్తుంటామని హెచ్చరిక
Ban on bulk sms for a period of 48 hours before Telangana General elections

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేటి సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 వరకూ సైలెన్స్ పీరియడ్ ఉంటుందని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ సమయంలో అభ్యంతరకర, రాజకీయపరమైన, బల్క్ ఎస్ఎమ్ఎస్‌ల ప్రసారంపై నిషేధం ఉంటుందని తెలిపారు. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 48 గంటల ముందు నుంచే రాజకీయపరమైన ఎస్ఎంఎస్‌లు ప్రసారాలను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. 

కాగా, పోలింగ్ కోసం జిల్లాలో పకడ్బందీ ఏర్పాటు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఈ మేరకు ముఖ్య ఎన్నికల అధికారులతో కలిసి కరీంనగర్‌లో ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి కూడా పాల్గొన్నారు.

More Telugu News