Hyderabad: హైదరాబాద్‌లో మరో చిన్నారిపై కుక్క దాడి

  • తీవ్రంగా గాయపడ్డ ఆరేళ్ల బాలుడు
  • వెనుక నుంచి వచ్చి దాడి చేసిన శునకం
  • బాలుడి పరిస్థితి విషమం.. ఆసుపత్రిలో చికిత్స
Another child was attacked by a dog in Hyderabad

హైదరాబాద్‌లో మరో చిన్నారిపై కుక్క దాడి జరిగింది. అత్తాపూర్‌-ఎన్‌ఎంగూడలో ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. బాలుడు వీధిలో నడిచి వెళ్తుండగా వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన శునకం అమాంతం అతడిపై దూకి దాడి చేసింది. శరీరంపై పలు చోట్ల బలంగా కొరికింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడున్నవారు గమనించి హుటాహుటిన బాలుడిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఏపీలోని కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోనూ నాలుగేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసింది. స్వల్ప గాయాలతో బాలుడు చికిత్స పొందుతున్నాడు.

ఇదిలావుంచితే చిన్నారులపై కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఏ కుక్క చిన్నారులపై దాడి చేస్తుందోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని అధికారులను స్థానికులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

More Telugu News