Nara Bhuvaneswari: "మైడియర్ సన్" అంటూ లోకేశ్ పై వాత్సల్యం కురిపించిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari opines on Lokesh restarts his Yuvagalam Padayatra after 79 days
  • స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ పై బయటికి వచ్చిన చంద్రబాబు
  • 79 రోజుల తర్వాత లోకేశ్ యువగళం మళ్లీ ప్రారంభం
  • హృదయం గర్వంతో ఉప్పొంగుతోందన్న నారా భువనేశ్వరి
చంద్రబాబు స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ పై బయటికొచ్చాక టీడీపీ కార్యక్రమాలకు మళ్లీ ఊపొచ్చింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 79 రోజుల విరామం తర్వాత యువగళం పాదయాత్రను పునఃప్రారంభించారు. దీనిపై నారా భువనేశ్వరి భావోద్వేగభరితంగా స్పందించారు. "మై డియర్ సన్" అంటూ తన కుమారుడు లోకేశ్ పై వాత్సల్యం కురిపించారు.

"ఇవాళ నువ్వు యువగళం పాదయాత్రకు బయల్దేరుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీపై చూపిస్తున్న అపారమైన ప్రేమాభిమానాలు, మద్దతు చూసి నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. సానుకూల మార్పు కోసం సాగుతున్న నీ ప్రస్థానం ఒక ఆశాదీపం. ధైర్యంగా ముందుకు సాగు. ప్రజల ఆకాంక్షలే నీకు మార్గదర్శనం చేస్తాయి... నిన్ను నడిపిస్తాయి" అంటూ నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు. 

ఇవాళ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పొదలాడ నుంచి యువగళం పాదయాత్ర పునఃప్రారంభించిన లోకేశ్ మొత్తం 15.4 కిలోమీటర్లు నడిచారు. రేపు ఆయన పాదయాత్ర పేరూరు, అమలాపురం, భట్నవిల్లి మీదుగా ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రవేశించనుంది.
Nara Bhuvaneswari
Nara Lokesh
Yuva Galam Padayatra
TDP
Andhra Pradesh

More Telugu News