Anil Ravipudi: 'భగవంత్ కేసరి'కి భారీగా లాభాలు .. ఖరీదైన కారును గిఫ్టుగా అందుకున్న అనిల్ రావిపూడి!

Shine_Screens gifted a brand new Toyota car to the sensational director Anil Ravipudi
  • ఇటీవల థియేటర్స్ కి వచ్చిన 'భగవంత్ కేసరి'
  • బాలకృష్ణకి హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెట్టిన సినిమా
  • ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తున్న సినిమా 
  • అనిల్ రావిపూడికి టయోటా కారును కానుకగా ఇచ్చిన నిర్మాతలు

టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ జాబితాలో ఉన్నవారిలో ఇంతవరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా ముందుకు వెళుతున్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటివారి జాబితాలో అనిల్ రావిపూడి ఒకరుగా కనిపిస్తాడు. 'పటాస్' నుంచి మొదలైన ఆయన కెరియర్ 'భగవంత్ కేసరి' వరకూ వచ్చింది. 

అనిల్ రావిపూడి ఇంతవరకూ తెరకెక్కించిన సినిమాలలో, ఒకదానికి మించి మరొకటి హిట్ అవుతూ ఉండటం విశేషం. వసూళ్ల విషయంలోను ఆయన ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నాడు. ఇటీవల బాలకృష్ణతో ఆయన చేసిన 'భగవంత్ కేసరి' .. రికార్డు స్థాయి వసూళ్లను తెచ్చిపెట్టింది. బాలకృష్ణకి హ్యాట్రిక్ హిట్ ను కట్టబెట్టింది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతలు షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు, దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన ఒక టయోటా కారును కానుకగా అందజేశారు. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు షికారు చేస్తోంది. మొత్తానికి అనిల్ రావిపూడికి 'భగవంత్ కేసరి' భారీ కానుకని ముట్టజెప్పాడన్నమాట. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News