Telangana Liquor Shops: మద్యం నిల్వలను వదిలించుకునేందుకు సమీపిస్తున్న గడువు.. తక్కువ ధరకు విక్రయిస్తే రూ. 4 లక్షల జరిమానా!

  • ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
  • 28 నుంచి 30వ తేదీ సాయంత్రం వరకు మద్యం అమ్మకాల బంద్
  • అదే రోజుతో ముగియనున్న పాత మద్యం విధానం
  • డిసెంబరు 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి
  • ఆలోగా మద్యం నిల్వలను వదిలించుకునే ప్లాన్‌లో దుకాణదారులు
Commissioner of Prohibition and Excise Department issues warning to liquor shops

తెలంగాణలో మరో నాలుగు రోజుల్లో పాత మద్యం విధానం ముగియనున్న వేళ ఆబ్కారీ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు మద్యాన్ని విక్రయిస్తే చర్యలు తీసుకోవడంతోపాటు జైలుశిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28 నుంచి పోలింగ్ జరిగే 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశించింది. అంతేకాదు, 30తో ప్రస్తుత మద్యం విధానం గడువు ముగుస్తుంది. డిసెంబరు 1 నుంచి కొత్త లైసెన్స్‌దారులు విక్రయాలు ప్రారంభిస్తారు.

గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పాత వ్యాపారులు తమ వద్దనున్న మద్యం నిల్వలను పూర్తిగా విక్రయించేందుకు రెడీ అయ్యారు. అందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో అవసరమైతే ఎమ్మార్పీ కంటే తక్కువకు విక్రయించాలని యోచిస్తున్నాయి. దీంతో ఆబ్కారీశాఖ తాజా హెచ్చరికలతో ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మార్పీ కంటే తక్కువకు విక్రయిస్తే రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు జరిమానాతోపాటు 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

More Telugu News