BRS: కొడంగల్‌లో బీఆర్ఎస్ నేత హత్యకు కాంగ్రెస్ కుట్ర పన్నింది: ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

BRS Complaint to Election commission on Kodangal issues
  • కొడంగల్ నియోజకవర్గంలో పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు
  • కాంగ్రెస్ నేతలు హింసకు పాల్పడేలా రెచ్చగొడుతున్నారన్న సోమా భరత్
  • కేటీఆర్‌కు సంబంధించి ఈసీ నోటీసుల ప్రతులు అందాక పూర్తి వివరాలు ఇస్తామని వెల్లడి
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, అలాగే కాంగ్రెస్ నేతలు హింసకు పాల్పడేలా రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ ఆరోపించారు. ఇక్కడ మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ వాహనంపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఫసియుద్దీన్‌తో కలిసి సోమా భరత్ ఎన్నికల తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ నేతలు హింసకు పాల్పడేలా రెచ్చగొడుతున్నారని, కొడంగల్‌లో బీఆర్ఎస్ నేత హత్యకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఫసియుద్దన్ వాహనంపై దాడి చేశారన్నారు. కొడంగల్ స్థానిక పోలీసులు కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికల సంఘం స్పందించకపోతే న్యాయపరంగా ముందుకు వెళతామని తేల్చి చెప్పారు. 

మంత్రి కేటీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసిన అంశంపై కూడా సోమా భరత్ స్పందించారు. కేటీఆర్‌కు ఇచ్చిన నోటీసుల ప్రతులు అందితే పూర్తి వివరాలు ఇస్తామని స్పష్టం చేశారు.
BRS
Congress
Telangana Assembly Election
kodangal

More Telugu News