Doctor: కాకినాడలో యువ డాక్టర్ ఆత్మహత్య

Kakinada Doctor Committed Suicide Due To Threats From Ycp Leaders
  • పురుగుల మందు తాగి బలవన్మరణం
  • అధికార పార్టీ లీడర్ల వేధింపులే కారణమని ఆరోపణలు
  • భూవివాదంలో మోసం చేశారంటున్న మృతుడి తల్లి
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో యువ డాక్టర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. భూ వివాదం పరిష్కారంలో మోసపోయాననే మనస్తాపంతో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. నగరంలోని అశోక్ నగర్ కు చెందిన డాక్టర్ నున్న శ్రీకిరణ్ చౌదరి శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. రష్యాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి తిరిగొచ్చిన శ్రీకిరణ్.. కాకినాడ జీజీహెచ్ మార్చురీ విభాగంలో డ్యూటీ చేస్తున్నాడు. 

భూవివాదం పరిష్కారం కోసం వైసీపీ నేతల సాయం కోరగా.. ఆస్తి పత్రాలు తీసుకుని వేధింపులకు గురిచేశారంటూ శ్రీకిరణ్ తల్లి రత్నం ఆరోపిస్తున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు కల్యాణ్ కృష్ణ, అతడి అనుచరుడు పెదబాబులే తన కొడుకు మరణానికి కారణమని మండిపడుతున్నారు. వారి బెదిరింపులతో మనస్తాపానికి గురై తన కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని రత్నం డిమాండ్ చేస్తున్నారు.
Doctor
Suicide
Kakinada
Ycp Leaders
Threat
AP Doctor
GGH

More Telugu News