Virender Sehwag: టీమిండియా డ్రెస్సింగ్ రూములోకి మోదీ.. భిన్నంగా స్పందించిన సెహ్వాగ్

Sehwag hails PM Modi visit to Indian dressing room
  • ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్
  • టీమిండియా డ్రెస్సింగ్ రూంలోకి మోదీ వెళ్లడంపై విమర్శలు
  • ప్రధాని మోదీని ప్రశంసించిన వీరేంద్ర సెహ్వాగ్
ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమి తర్వాత ప్రధాని నరేంద్రమోదీ టీమిండియా డ్రెస్సింగ్ రూములోకి ప్రవేశించడం విమర్శలకు కారణమైంది. ఓటమికి బాధపడొద్దంటూ ఆటగాళ్లలో మోదీ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. అయితే, ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూములోకి మోదీ వెళ్లడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధమన్న విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ విమర్శలపై తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భిన్నంగా స్పందించాడు. ఓ ప్రధాని ఇలా డ్రెస్సింగ్ రూములోకి వచ్చి ఆటగాళ్లను ఓదార్చడం ఇదే తొలిసారని, అలా ఎక్కడా జరగలేదని ప్రశంసించాడు. వచ్చే ప్రపంచకప్‌ను గెలిచేలా మోదీ వారిలో స్ఫూర్తి నింపారని కొనియాడాడు.
Virender Sehwag
Narendra Modi
Team India
Team India Drssing Room

More Telugu News