Rahul Gandhi: హైదరాబాద్‌లో రాత్రివేళ రాహుల్ పర్యటన..నిరుద్యోగులతో ముచ్చట్లు

Rahul gandhi met with students preparing for competitive exams in hyderabad
  • ముషీరాబాద్, అశోక్ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ సీనియర్ నేత
  • పోటీ పరీక్షల విద్యార్థుల సాధకబాధకాలను అడిగి తెలుసుకున్న వైనం
  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని భరోసా
  • స్టూడెంట్లతో కలిసి చిక్కడపల్లి బావర్చీలో బిర్యాని తిన్న రాహుల్
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పట్టుదలగా ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. పోలింగ్‌కు నాలుగు రోజులే ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వినూత్న మార్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 

శనివారం రాత్రి రాహుల్ నగరంలోని ముషీరాబాద్, అశోక్ నగర్ ప్రాంతాల్లో అకస్మాత్తుగా పర్యటించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో చిట్‌చాట్ నిర్వహించారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పేపర్ లీక్ ఉదంతం, నోటిఫికేషన్ల నిలిపివేత వంటి అంశాలు చర్చకు వచ్చాయి. కాగా, ఉద్యోగార్థులపై సీఎం కేసీఆర్ తీరును రాహుల్ ఖండించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో కొందరు పోటీ పరీక్షల అభ్యర్థులతో కలిసి చిక్కడపల్లిలోని బావర్చీ హోటల్‌లో బిర్యానీ తిన్నారు. అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు.
Rahul Gandhi
Hyderabad
Congress
BJP
KCR

More Telugu News