Jabardasth: జబర్ధస్త్ ఫైమాకు ఏమైంది?.. వైరల్‌గా మారిన ఫొటోలపై ఫ్యాన్స్ సందేహాలు

What happened to Jabardhast Faima Fans have doubts about the photos that have gone viral
  • హాస్పిటల్ బెడ్‌పై పడుకున్న ఫొటోలు, వీడియో వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్ కలవరం
  • ఏదైనా ప్రోగ్రామ్ లో భాగమా లేక నిజమా అంటూ ఆరా తీస్తున్న నెటిజన్లు
  • దీనిపై ఇంకా స్పందించని ఫైమా
బుల్లితెర కామెడీ షో ‘జబర్ధస్త్’ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్ట్ ఫైమాకు ఏమైందని ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే ఫైమా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య పోస్ట్ చేసిన రీల్ ఇందుకు కారణమైంది. ఈ రీల్‌లో ఫైమా హాస్పిటల్‌ బెడ్‌పై పడుకొని కనిపించింది. పేషెంట్ డ్రెస్‌లో చేతికి కెనాల్ కూడా ఉండడంతో ఆమెకు ఏదో చికిత్స జరుగుతున్నట్టుగా ఉంది. దీంతో ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే ‘నా గతమంతా నే మరిచానే’ అనే పాటను యాడ్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఏదైనా షూటింగ్‌లో భాగమా అంటూ పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రోగ్రామ్ లేదా షూటింగ్‌లో భాగమైతే వివరాలు చెప్పాలని, ఫ్యాన్స్‌ని ఈ విధంగా ఆందోళనకు గురిచేయడం సబబు కాదని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. అయితే ఈ సందేహాలపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

ఇదిలావుండగా జబర్దస్త్ షో ద్వారా ఫైమా చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన శైలితో నవ్వులు పూయిస్తోంది. పంచ్‌ల‌ు, హావభావాలతో అందరినీ అలరిస్తోంది. బిగ్ బాస్ సీజన్6 ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన విషయం తెలిసిందే.
Jabardasth
Faima
Bigg Boss
Instagram
Viral Pics

More Telugu News