Chandrababu: ఈ నెల 27న సతీసమేతంగా ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు

Chandrababu will attend Siddarth Luthra son wedding reception
  • చంద్రబాబు కేసులు వాదిస్తున్న సుప్రీం న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా
  • లూథ్రా ఇంట పెళ్లి బాజాలు... రేపు ఢిల్లీలో తనయుడి వివాహం
  • ఈ నెల 27న పెళ్లి రిసెప్షన్
  • హాజరుకానున్న చంద్రబాబు, నారా భువనేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు కేసులు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. రేపు (నవంబరు 26) ఢిల్లీలో సిద్ధార్థ్ లూథ్రా తనయుడి వివాహం జరగనుంది. ఎల్లుండి (నవంబరు 27) రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి రిసెప్షన్ కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి కూడా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు. చంద్రబాబు ఈ నెల 28 వరకు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. 

కాగా, ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో, చంద్రబాబు త్వరలోనే మళ్లీ ప్రజల్లోకి రానున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడనుంది.

  • Loading...

More Telugu News