Tillu Square: టిల్లు స్క్వేర్ నుంచి 'రాధిక' సాంగ్... ప్రోమో వీడియో ఇదిగో!

Radhika song promo out now
  • డీజే టిల్లుతో హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ
  • మల్లిక్ రామ్ దర్శకత్వంలో టిల్లు స్క్వేర్
  • సిద్ధు సరసన హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్
  • డీజే టిల్లులో రాధికగా అలరించిన నేహా శెట్టి
  • టిల్లు స్క్వేర్ లో రాధికగా అనుపమ

డీజే టిల్లు చిత్రంతో యూత్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' తో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం నుంచి 'రాధిక' అనే సాంగ్ ఈ నెల 27న సాయంత్రం 4.05 గంటలకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, నేడు 'రాధిక' సాంగ్ ప్రోమోను చిత్ర బృందం పంచుకుంది. 

'డీజే టిల్లు' చిత్రంలో 'రాధిక' పాత్రను నేహా శెట్టి పోషించగా, 'టిల్లు స్క్వేర్' లో అనుపమ పరమేశ్వరన్ 'రాధిక'గా అలరించనుంది. ఇప్పుడా 'రాధిక' పేరు మీదనే ఓ సాంగ్ ను ను విడుదల చేయనున్నారు. ఈ పాటకు రామ్ మిరియాల బాణీలు అందించడమే కాకుండా ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చారు. 

సితార ఎంటర్టయిన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News