DK Shivakumar: హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు, వైఎస్ కృషి చేశారు: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్

DK Shivakumar praises TDP chief chandrababu and YSR
  • తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్న డీకే శివకుమార్
  • హైదరాబాద్, బెంగళూరు నగరాలు దేశానికి కవల పిల్లల వంటివని వ్యాఖ్య
  • తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతి ఇచ్చే సమయం వచ్చిందన్న డీకే శివకుమార్
హైదరాబాద్ అభివృద్ధికి టీడీపీ అధినేత చంద్రబాబు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలు దేశానికి కవల పిల్లల వంటివన్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో దేశమే కాదు... ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రజలు బహుమతి ఇచ్చే సమయం వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కర్ణాటకలో తమ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. కర్ణాటక గురించి కేసీఆర్, కేటీఆర్ తెలుసుకుంటే మంచిదన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేస్తామన్నారు.
DK Shivakumar
Telangana Assembly Election
Congress

More Telugu News