Mallu Bhatti Vikramarka: 100 మంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును తాకలేరు: మల్లు భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka speech in Madhira public meeting
  • మధిరలో 50వేల మెజార్టీతో గెలుస్తానని మల్లు భట్టి ధీమా
  • కేసీఆర్, కేటీఆర్ ఉడుత ఊపులకు మధిర భయపడదని వెల్లడి 
  • అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ
ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న ఇక్కడకు వచ్చి తాను మధిర నుంచి మళ్లీ గెలవనని చెబుతున్నాడని, కానీ ఒక్క కేసీఆర్ కాదు... వందమంది కేసీఆర్‌లు వచ్చినా తన గెలుపును ఆపలేరని, కనీసం మధిర గేటు తాకలేరని కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిరలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ... తాను 50వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఉడుత ఊపులకు ఇక్కడ మధిర ప్రజలు భయపడరన్నారు. ఉద్యోగం రావడం కోసం అందరూ ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. రూ.500కు గ్యాస్ సిలిండర్ ను ఇస్తామన్నారు.

సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ మధిర అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో సంపద అందరికీ సమానంగా అందుతుందని, ప్రజారంజక పాలన వస్తుందని భావిస్తే ఆ ఆశలు నెరవేరలేదన్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రమే దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు రావాలంటే... రైతులకు గిట్టుబాటు ధర కావాలంటే... హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తాము ఆరు గ్యారెంటీలు ప్రకటించామన్నారు.
Mallu Bhatti Vikramarka
Congress
KCR
Telangana Assembly Election

More Telugu News