Yogi Adityanath: ఒవైసీకి కేసీఆర్ భయపడుతున్నారు: యోగి ఆదిత్యనాథ్

  • వేములవాడలో ప్రచారాన్ని నిర్వహించిన యోగి
  • తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని విమర్శ
  • గతంలో యూపీలో కూడా తెలంగాణ పరిస్థితులే ఉండేవని వ్యాఖ్య
KCR is afraid of Owaisi says Yogi Adityanath

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల అగ్రనేతలు తెలంగాణలోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరపున మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ తదితర కీలక నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వేములవాడలో నిర్వహించిన బీజేపీ సభలో యోగి ఆదిత్యనాథ్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అంటే కేసీఆర్ కు భయమని ఎద్దేవా చేశారు. 

అవినీతి పాలనతో తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని ఆరోపించారు. మిగులు ఆదాయంతో ఉన్న తెలంగాణను అప్పుల్లోకి నెట్టేశారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేస్తామని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజల కలలను నిర్వీర్యం చేశాయని అన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ లో కూడా తెలంగాణలాంటి పరిస్థితులే ఉన్నాయని... కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయిందని చెప్పారు. తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి రావాలంటే... ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని అన్నారు.

More Telugu News