New Delhi: దుబాయ్‌లో పుట్టినరోజు వేడుక జరపలేదని కోపం.. భర్తను ముక్కుపై కొట్టి హత్య!

  • ఢిల్లీలో శుక్రవారం వెలుగు చూసిన ఘటన 
  • పుట్టినరోజు వేడుకకు సంబంధించి భార్యాభర్తల మధ్య వాగ్వాదం
  • భర్త ముక్కుపై భార్య ముష్టిఘాతాలు 
  • తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిన బాధితుడు
Woman punches husband to death for not taking her to Dubai for birthday celebration

దుబాయ్‌ తీసుకెళ్లి భార్య పుట్టినరోజు వేడుక జరిపించేందుకు నిరాకరించిన ఓ వ్యక్తి చివరకు అనూహ్య రీతిలో హతుడయ్యాడు. తన కోరిక తీర్చలేదని రెచ్చిపోయిన భార్య అతడి ముక్కుపై ముష్టిఘాతాలు కురిపించడంతో అతడికి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ముృతిచెందాడు. 

జాతీయ మీడియా కథనాల ప్రకారం, నిఖిల్ ఖన్నా(35) అనే వ్యక్తికి ఆరేళ్ల క్రితం రేణుక అనే యువతితో వివాహమైంది. వారిది ప్రేమ వివాహం. నిఖిల్ నిర్మాణ రంగంలో ఉన్నాడు.  కాగా, రేణుక పుట్టినరోజు వేడుకలను దుబాయ్‌లో జరిపేందుకు నిఖిల్ నిరాకరించడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. పెళ్లిరోజున భర్త ఖరీదైన బహుమతులు ఇవ్వకపోవడం కూడా ఆమెకు ఆగ్రహం తెప్పించింది. ఢిల్లీలో బంధువుల మధ్య తన పుట్టినరోజు జరుపుకునేందుకు భర్త అంగీకరించకపోవడంతో రేణుకలో కోపం కట్టలు తెంచుకుంది. 

ఈ క్రమంలో దంపతుల మధ్య శుక్రవారం గొడవ జరగ్గా విచక్షణ కోల్పోయిన రేణుక భర్త ముక్కుపై బలంగా ముష్టిఘాతాలు కురిపించింది. ఆ దెబ్బలకు నిఖిల్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో పాటూ పళ్లు కూడా ఊడిపోయాయి. దీంతో, బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేణుకను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News