Salman Khan: చిరిగిన బూట్లతో సల్మాన్ ఖాన్ ‘టైగర్-3’ మూవీకి ప్రచారం!

Salman Khan sports torn faded shoes as he promotes Tiger 3 with Katrina Kaif fans say Love his simplicity
  • టైగర్-3 మూవీ ప్రచారంలో పాత బూట్లు ధరించిన సల్మాన్ ఖాన్
  • నెట్టింట ఫొటోలు వైరల్
  • నటుడి సింప్లిసిటీ చూసి అభిమానులు, నెటిజన్ల ప్రశంసలు 
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ వ్యక్తిగత జీవితంలో చాలా సింపుల్‌గా ఉంటాడని ఆయనను దగ్గర నుంచి చూసిన వారు తరచూ చెప్పేమాట! ఇది నిజమని సల్మాన్ ఖాన్ మరోసారి నిరూపించాడు. నటి కత్రినా కైఫ్‌తో కలిసి ఇటీవల టైగర్-3 చిత్రం ప్రచారంలో పొల్గొన్న సల్మాన్ పాత బూట్లతో కనిపించాడు. అంతటి స్టార్ అయ్యుండీ చిరిగి, వెలిసిపోయిన షూస్ వేసుకునేందుకు ఏమాత్రం వెనకాడని సల్మాన్ ఖాన్‌ను చూసి అభిమానులు, నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. పాత వస్తువులను మళ్లీ వాడటంలో తప్పేంలేదని, ఇది సల్మాన్ సింప్లిసిటీకి నిదర్శనమని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. 

ఇటీవల టైగర్-3 మూవీతో భారీ విజయాన్ని అందుకున్న సల్మాన్ మీడియా సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయగర్వం తలకెక్కకుండా జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించడమే తన లక్ష్యమని చెప్పాడు.  ప్రజాభిమానం కూడా పొందడం తనకు దక్కిన అదృష్టమని వ్యాఖ్యానించాడు.
Salman Khan
Tiger-3
Bollywood
Katrina Kaif

More Telugu News