Trisha: మన్సూర్ అలీఖాన్ క్షమాపణలు చెప్పడంపై త్రిష స్పందన

  • త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మన్సూర్
  • వివాదాస్పదం కావడంతో క్షమాపణ చెప్పిన వైనం
  • మన్నించడం దైవగుణం అన్న త్రిష
Trisha response on Mansoor Ali Khan apology

ప్రముఖ హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. 'లియో' సినిమాలో త్రిషను రేప్ చేసే సీన్ ఉంటుందని తాను భావించానని... అయితే ఆ సీన్ లేకపోవడంతో తాను చాలా నిరాశపడ్డానని ఆయన అన్నారు. ఈ అసభ్యకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మన్సూర్ పై విచారణ చేయాలని ఆదేశించింది. మరోవైపు చెన్నై పోలీసులు ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో త్రిషకు మన్సూర్ క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలో త్రిష స్పందిస్తూ... తప్పు చేయడం మానవ సహజమని... దాన్ని మన్నించడం దైవగుణమని అన్నారు. దీంతో, ఈ వివాదానికి ముగింపు కార్డు పడినట్టయింది.

More Telugu News