KCR: సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

EC issues notices to kcr over his speech in bansuwada
  • అక్టోబర్ 30న ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగంపై కాంగ్రెస్ ఫిర్యాదు
  • కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో కేసీఆర్ రెచ్చగొట్టేలా ప్రసంగించారన్న కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్
  • ఫిర్యాదుపై స్థానిక రిటర్నింగ్ అధికారి విచారణ, ఈసీకి నివేదిక
  • నివేదిక ఆధారంగా ఈసీ నోటీసులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సీఎంకు హెచ్చరిక
ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది. అక్టోబర్ 30న బాన్సువాడలో జరిగిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్.. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రూల్స్‌కు విరుద్ధమని స్పష్టం చేసింది. స్టార్ కాంపెయినర్‌గా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇలాంటి ప్రసంగాలు చేసిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం తమకు ఉందని గుర్తు చేసింది. ప్రస్తుత వ్యాఖ్యలను మాత్రం సీరియస్‌గా తీసుకోవట్లేదని పేర్కొంది. 

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ ప్రజాశీర్వాద సభలో రెచ్చగొట్టేలా మాట్లాడారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ విచారణకు ఆదేశించగా స్థానిక రిటర్నింగ్ అధికారి ఈ నెల 14న ఈసీకి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఈసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది.
KCR
Telangana Assembly Election
Election Commission
Congress
BRS

More Telugu News