Imad Wasim: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పాకిస్థాన్ ఆల్ రౌండర్

  • రిటైర్మెంట్ ప్రకటించిన ఇమాద్ వసీమ్.. ఎక్స్ వేదికగా ప్రకటన
  • పీసీబీకి ధన్యవాదాలు తెలిపిన ఇమాద్
  • వన్డే, టీ20 కలిపి 121 మ్యాచ్‌ల్లో పాక్‌కు ప్రాతినిధ్యం
Pakistan all rounder Imad Wasim bids farewell to international cricket

పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు శుక్రవారం తన రిటైర్మెంట్‌ను ‘ఎక్స్’ వేదికగా ప్రకటించాడు. ‘‘ ఈ మధ్య నా అంతర్జాతీయ క్రికెట్ గురించి ఆలోచించుకున్నాను. వీడ్కోలు పలికేందుకు ఇదే తగిన సమయమని నిర్ణయించుకున్నాను. వన్డే, టీ20 ఫార్మాట్‌లో ఆడిన 121 మ్యాచ్‌లలో ప్రతి ఒక్కటి నా కలలను సాకారం చేశాయి. పాకిస్థాన్ క్రికెట్ కోచ్‌లు, నాయకత్వంతో ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది. ఇందులో భాగస్వామ్యం అయ్యే ప్రతి ఒక్కరూ గెలవాలని కోరుకుంటున్నాను. పాక్ జట్టు రాణించడం కోసం నేను ఎదురు చూస్తుంటాను’’ ఎక్స్‌లో ఇమాద్ రాసుకొచ్చాడు.

పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడం నిజంగా గౌరవంగా ఉందని, ఏళ్లపాటు మద్దతు ఇచ్చిన పీసీబీకి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నాడు. అయితే అంతర్జాతీయేతర ఆటగాడిగా తన క్రికెట్ కెరియర్‌పై దృష్టి సారిస్తానని ఇమాద్ చెప్పాడు. కాగా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన ఇమాద్ 55 వన్డేల్లో 42.86 సగటుతో 986 పరుగులు చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్‌తో 44 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక 66 టీ20ల్లో 486 పరుగులు, 65 వికెట్లు తీశాడు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రావల్పిండి వేదికగా న్యూజిలాండ్‌పై ఆడిన టీ20 చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా ఉంది. కాగా మే 2015లో జింబాబ్‌పై టీ20 మ్యాచ్‌తో ఇమాద్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మొదలైంది. 

More Telugu News