Ukku Satyagraham: వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే నటించిన చిత్రం 'ఉక్కు సత్యాగ్రహం'... గద్దర్ కుమార్తె చేతుల మీదుగా ట్రైలర్ విడుదల

Gaddar daughter launches Ukku Satyagraham movie trailer and songs
సత్యారెడ్డి దర్శకనిర్మాతగా ఉక్కు సత్యాగ్రహం
కథానాయకుడు కూడా సత్యారెడ్డే!
విశాఖ ఉక్కు పరిశ్రమ ఇతివృత్తంతో చిత్రం
ఈ సినిమాలో నటించిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే ధర్మశ్రీ
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఉక్కు సత్యాగ్రహం. ఈ చిత్రంలో సత్యారెడ్డి కథానాయకుడు. దర్శకత్వం, నిర్మాణం కూడా ఆయనే. పల్సర్ బైక్ సాంగ్ ఫేమ్ ఝాన్సీ (గాజువాక డిపో కండక్టర్) కథానాయికగా నటిస్తోంది. 

కాగా, ఈ చిత్రంలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (విశాఖ), వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ (చోడవరం) తదితరులు నటించారు. ప్రజాగాయకుడు గద్దర్ ఓ కీలక పాత్ర పోషించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం జరిగిన ఉద్యమం, పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను, పాటలను గద్దర్ కుమార్తె వెన్నెల విడుదల చేశారు. 

ఈ సందర్భంగా గద్దర్ కుమార్తె మాట్లాడుతూ, తన తండ్రి ప్రజల కోసం ఎంతో పాటు పడ్డారని, ఆయన పాటలన్నీ ప్రజా సమస్యలపైనే ఉండేవని తెలిపారు. గద్దర్ ప్రజాసమస్యలపై వచ్చిన చిత్రాల్లో నటించారని, ఈ ఉక్కు సత్యాగ్రహం చిత్రంలోనూ నటించారని, పాటలు కూడా రాశారని వెన్నెల వివరించారు. 

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పందిస్తూ, ఈ సినిమాలో తనను కూడా భాగం చేయడం ఆనందం కలిగిస్తోందని తెలిపారు. 
Ukku Satyagraham
Movie
Trailer
Songs
Vennela
Gaddar
Satyareddy
MVV Satyanarayana
Karanam Dharmasri
YSRCP
Visakhapatnam

More Telugu News